షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్ హీరో ఎంట్రీ!

ఇంకో సరికొత్త వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో కాలుమోపుతోన్న మరో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తులు రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ సిరీస్ ప్లాన్ చేశారు. లీడ్ గా షాహిద్ ని, ఫీమేల్ లీడ్ గా రాశీ ఖన్నాని ఎంచుకున్నారు. ఆల్రెడీ మేకింగ్ మొదలైపోయిన ఈ క్రేజీ ఓటీటీ ప్రాజెక్ట్ లో సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా ఉండటం మరింత విశేషం!

‘సన్నీ’ వెబ్ సిరీస్ లో షాహిద్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. గతంలో ‘ఉడ్తా పంజాబ్, కమీనే, హైదర్’ లాంటి సినిమాలు చేసిన ఆయన ‘కబీర్ సింగ్’తోనూ తన సత్తా చాటాడు. నటుడిగా తిరుగులేని మిష్టర్ కపూర్ ఇప్పుడు రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో మరింత సర్ ప్రైజ్ చేయనున్నాడట. తన ఫస్ట్ వెబ్ సిరీస్ లోనే షాహిద్ అద్భుతమైన పాత్రతో అలరిస్తాడని టాక్. ఇక విజయ్ సేతుపతితో ఆయన ఫేస్ ఆఫ్ మరింత ఇంట్రస్టింగ్ గా, మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట! చూడాలి మరి, ‘ద ఫ్యామిలి మ్యాన్’ మేకర్స్ మన హ్యాండ్సమ్ మ్యాన్ షాహిద్ కి అమేజాన్ ప్రైమ్ లో ఎలాంటి అమేజింగ్ సక్సెస్ అందిస్తారో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-