Woman Pours Fake Blook On Her In Cannes Film Festival: అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్ ఫెస్టివల్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రెడ్ కార్పెట్‌పై ఒక మహిళ తనపై రక్తం పోసుకుంది. అప్పుడు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకొని, అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆమె కేన్స్ ఫెస్టివల్‌లో ఈ పనికి పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫెస్టివల్‌లో ఆదివారం సాయంత్రం ఫ్రెంచ్ చలనచిత్ర దర్శకుడు జస్ట్ ఫిలిప్పోట్ రూపొందించిన రష్యన్ సినిమా ‘యాసిడ్’ని ప్రదర్శించారు. అయితే.. ఈ ప్రీమియర్‌కి ముందు ఒక మహిళ ఉక్రెయిన్ జెండా రంగులున్న దుస్తులు ధరించి, రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళ్లింది.
SpiceJet: స్పైస్‌జెట్ పైలట్లకు గుడ్‌న్యూస్.. జీతం నెలకు రూ.7.5 లక్షలకు పెంపు
మెట్లపైకి ఎక్కిన తర్వాత ఒక చోట నిలబడి ఫోటోలను పోజులిచ్చింది. ఆమె అందంగా ముస్తాబై రావడంతో, కెమెరాలన్ని ఆమెవైపే మళ్లాయి. సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ తనతో పాటు తెచ్చుకున్న ఒక బాటిల్‌ని బయటకు తీసింది. దాన్ని తెరిచి, ఎరుపు రంగు నీళ్లను తన ఒంటిపై పోసుకోవడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆమె ఈ పని చేసింది. దీంతో.. ఆమె చేసిన పని చూసి, అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. అప్పుడు అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలామంది నెటిజన్లు ఆమె చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ మహిళ పేరు ఇలోనా చెర్నోబై. ఆమె ఒక ఉక్రెయిన్ ఇన్స్‌ప్లూయెన్సర్.
Love Tragedy: ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇంట్లోకి చొరబడి..
కాగా.. గత సంవత్సర కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో నెత్తుటి దారులు ఏరులై పారుతున్నాయి. దీనికి సంకేతంగా ఆ మహిళ నకిలీ రక్తంతో ఈ రకంగా తన నిరసన తెలిపింది. గతేడాది కూడా ఒక మహిళ సరిగ్గా ఇలాగే అనూహ్య నిరసనకు దిగి, అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ.. ఈ ఏడాది కూడా రష్యా ప్రతినిధులు, ఫిల్మ్ కంపెనీలపై కేన్స్ నిషేధం విధించారు.