Puffer Fish: డెడ్లీ ఫిష్.. చేపను తిని భార్య మృతి.. కోమాలో భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puffer Fish: మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు. తన తండ్రి చాలా ఏళ్లుగా ఒకే చేపల వ్యాపారి నుంచి చేపలను కొనుగోలు చేస్తున్నారని, ఇలాంటి చేపను తింటే ప్రమాదంలో పడతామని వారికి తెలియదని కుమార్తె చెప్పింది.
Read Also: Iran: హిజాబ్ ధరించనందుకు మహిళలపై దాడి, ఆ తరువాత అరెస్ట్.. వీడియో వైరల్..
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
పఫర్ చేపను దంపతులు మధ్యాహ్న భోజనంలో తీసుకున్న తర్వాత కొద్ది సేపటికే మహిళ లిమ్ సీవ్ గ్వాన్ శరీరం వణకడంతో పాటు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారింది. కొన్ని గంటల తర్వాత ఆమె భర్తకు కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయి. వెంటనే వారి కుమారుడు తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించగా తల్లి మరణించింది. ప్రస్తుతం తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్నాడు.
పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైన, రుచికరమైన చేప. దీన్ని వండేందుకు సుక్షితులైన వంటగాళ్లు ఉంటారు. అవగాహన లేకుండా వండితే దాదాపుగా ప్రాణాలు పోతాయి. ముఖ్యంగా జపాన్ దేశంలో ఈ పఫర్ చేపను ఇష్టంగా తింటారు. ఈ దేశంలో ఈ చేపను వండేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చేపలో అత్యంత విషపూరితమైన సిగ్వేటరా టాక్సిన్ లేదా టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే శక్తివంతమైన విషాలు ఉంటాయి. ఇది కార్డియాక్ డిస్రిథ్మియా, శ్వాసకోశ వైఫల్యం, న్యూరోలాజికల్ గా ప్రభావం చూపిస్తుంది. ఈ విషాలను తొలగించడం ట్రైన్డ్ చెఫ్ లకే సాధ్యం అవుతుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!