అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకున్న హక్కును కాపాడుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం పాలనా ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బైడెన్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో పొరపాటు దొర్లింది. టెలిప్రాంప్టర్‌పై స్క్రోల్ అయిన సూచనలను కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దానిపై ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శనాత్మకంగా స్పందించారు. ఓ ఆంగ్ల చిత్రంలోని సన్నివేశాన్ని షేర్ చేస్తూ.. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
జో బైడెన్ తన ప్రసంగ సమయంలో టెలిప్రాంప్టర్‌పై స్క్రోల్ అయిన లైన్‌ను కూడా చదివేశారు. స్క్రోల్ అయిన ‘రిపీట్ ద లైన్’ అనే సూచనను కూడా ఆయన చదివేశారు. ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా.. దానిపై మస్క్ స్పందిస్తూ.. ‘టెలిప్రాంప్టర్‌ను ఎవరు నియంత్రిస్తారో వారే నిజమైన అధ్యక్షుడు’ అంటూ ఆ సినిమాలోని చిత్రాన్ని షేర్ చేశారు. ఓ ఆంగ్ల చిత్రంలోని సన్నివేశంలో హీరో తనపేరును తానే చదువుకుంటాడు. ‘ప్రాంప్టర్ మీద ఏం రాసినా.. బుర్గుండీ చదువుతారు’ అంటూ హీరోను ఉద్దేశించి ఉన్న సెటైర్ ఆ పోస్టులో కనిపిస్తోంది.
Joe Biden: గర్భస్రావం హక్కులపై బైడెన్ కీలక ఉత్తర్వులు
ఇదిలా ఉండగా.. రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకున్న హక్కును కాపాడుతూ జో బైడెన్ శుక్రవారం పాలనా ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే ఈ హక్కును పరిరక్షించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని తమ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Whoever controls the teleprompter is the real President! pic.twitter.com/1rcqmwLe9S
— Elon Musk (@elonmusk) July 8, 2022