Joe Biden: గర్భస్రావం హక్కులపై బైడెన్ కీలక ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకున్న హక్కును కాపాడుతూ జో బైడెన్ శుక్రవారం పాలనా ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ రాజ్యాంగ హక్కును రెండు వారాల కిందట అమెరికా సుప్రీంకోర్టు రద్దుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హక్కును పరిరక్షించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని తమ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తుది నిర్ణయాధికారం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)దే కాబట్టి తన ఉత్తర్వుతో పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుందని బైడెన్ వివరిస్తున్నారు.
India: షింజో అబే హత్యకు భారత్ సంతాపం.. జాతీయ జెండా అవనతం
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
అబార్షన్‌పై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే యోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల వల్ల పరిమిత ప్రయోజనం మాత్రమే ఉండే అవకాశం ఉంది. గర్భస్రావాన్ని సమ్మతించే రాష్ట్రాలకు వెళ్లి, అక్కడి సేవలను వినియోగించుకోవడంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాజా ఉత్తర్వులు రక్షణ కల్పిస్తాయి. అలాగే, గర్భస్రావ హక్కును కాపాడడంలో కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని న్యాయ, ఆరోగ్య-మానవ సేవల శాఖను బైడెన్ ఆదేశించారు.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!