Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకి హత్య.. ఇంతకీ ఎవరీ ఉస్మాన్ హాదీ..?
- బంగ్లాదేశ్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు..
- విద్యార్థి నేత హాదీ హత్యతో పెద్దఎత్తున నిరసనలు..
- హాదీ హత్యతో బంగ్లాలో ఆగ్రహ జ్వాలలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. విద్యార్థి ఉద్యమంతో హసీనా సర్కార్ ను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇప్పుడు దుండగుల చేతిలో తన ప్రాణాలను కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు రేకెత్తున్నాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారాయి. అయితే, ఇంతకీ ఎవరీ ఉస్మాన్ హాదీ..?
Read Also: Venky Atluri : లక్కీభాస్కర్ కు సీక్వెల్ చేసే ఆలోచనలో వెంకీ అట్లూరి
Also Read
- Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
- Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
కాగా, బంగ్లాదేశ్‌లోని ఝల్కాతీ జిల్లాలో 1994లో షరీఫ్ ఉస్మాన్ హాదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో ఉన్న అతడు.. విద్యార్థి లీడర్ గా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీ లీగ్ నేత, నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీ రోల్ పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేక కామెంట్స్ చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్‌లను పంచినట్లు తాజాగా వార్తలు బయటకు వచ్చాయి.
Read Also: Gudivada Amarnath: వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.. ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి ఉంది..
అయితే, గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ.. తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు.. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతో షరీఫ్ ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ.. డిసెంబర్ 12వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు గత శనివారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం నాడు మరణించాడు.
Read Also: Delhi Firing: రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ.. 52 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు
ఇక, ఉస్మాన్ హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో ఆగ్రహజ్వాలలు ప్రారంభమైయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీలీగ్ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి.
తాజావార్తలు
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!