కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఎంతో.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కోవిడ్.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. వైద్య రంగంలోని లోటును కళ్లకు కట్టింది.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహమ్మారి బారినపడి కోలుకోగా.. దాదాపు కోటిన్నర మంది ప్రాణాలు వదిలారు. కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడిచినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్)వో ప్రకటించింది. దేశాలవారీగా వివరాలను కూడా వెల్లడించింది.. భారత్‌లో కోవిడ్ మరణాలు 47 లక్షలని తేల్చింది డబ్ల్యూహెచ్‌వో.. అయితే, ఈ ప్రకటనను భారత్ కొట్టిపారేసింది.. కోవిడ్ మరణాల లెక్కింపు విషయంలో డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన విధానం సరైంది కాదంటోంది.
Read Also: Astrology: మే 06, శుక్రవారం దినఫలాలు
అయితే, ప్రపంచవ్యాప్తంగా జనవరి 2020 ఆరంభం నుంచి 2021 డిసెంబర్ చివరకు మరణించినవారి సంఖ్య 1.33– 1. 66 కోట్లు ఉంటుందని, సరాసరిన తీసుకుంటే.. ఈ సంఖ్య 1.49 కోట్లు అని చెబుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్.. ఇక, కోవిడ్ మరణాలు దక్షిణాసియా, యూరప్, అమెరికాలో అధికంగా ఉండగా.. భారత్‌లో 47,40,894 మంది కోవిడ్‌తో మృతిచెందినట్టు ప్రకటించింది డబ్ల్యూహెచ్‌వో… కానీ, భారత్‌లో అధికార లెక్కల ప్రకారం 2020లో 1.49 లక్షల కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన కోవిడ్ మరణాల్లో మూడింట ఒకవంతు భారత్‌లో సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.