Israel-Hamas War Resume: ఇజ్రాయిల్, హమాస్ మధ్య ముగిసిన స్వాప్ డీల్.. పునఃప్రారంభమైన వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War Resume: ప్రంపంచ దేశాల నేతృత్వంలో ఇజ్రాయిల్ అలానే హమాస్ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాగా ఈ తాత్కాలిక ఒప్పందం వారం రోజుల తరువాత ఈరోజు ముగిసింది. కాగా ఒప్పందం ముగిసిన క్షణాలలోనే ఇజ్రాయిల్ హమాస్ పైన ఇజ్రాయిల్ దాడులను పునః ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని.. ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ ప్రారంభమైందని పేర్కొన్నారు. కాగా యుద్ధం పునః ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మరణాలు నమోదైయ్యాయి అని పాలస్తీనా ఆరోగ్య శాఖా అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. ఇరుదేశాల మధ్య సంధి ముగిసిన మొదటి 90 నిమిషాలలో ఆటోమేటిక్ ఆయుధాలు కాల్పుల జల్లును కురిపించాయి.
Read also:Sreemukhi: ఆరంజ్ డ్రెస్సుతో ఆకట్టుకుంటున్న బుల్లితెర బ్యూటీ…శ్రీముఖి
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ఒక్కసారిగా ఆ ప్రాంతం పేలుళ్ల శబ్దాలతో ఉల్లిక్కి పడింది. కాగా గాజా లోని హమాస్ లక్ష్యాలపై ఫైటర్ జెట్లు ప్రస్తుతం దాడి చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలానే దక్షిణ గాజా లోని రఫా లోని అల్-నజర్ ఆసుపత్రి డైరెక్టర్ మార్వాన్ అల్-హమ్స్, ఇజ్రాయెల్ ఉత్తర భూభాగాన్ని విడిచిపెట్టమని హెచ్చరించారు. దీనితో చాలా మంది పాలస్తీనియన్లు అక్కడి నుండి పారిపోయారు. కాగా ఈ దాడుల్లో మొదటి 60 నిమిషాల్లో నలుగురు చిన్నారులతో పాటుగా మొత్తం 9 మంది మరణించారని తెలిపారు. కాగా యుద్ధం తిరిగి ప్రారంభమైన గంటలో గాజా సమీపం లోని అనేక ప్రాంతాల చుట్టూ సంభావ్య క్షిపణి కాల్పుల హెచ్చరిక సైరన్లు వినిపించాయని.. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంతో సహా ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను పునఃప్రారంభిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!