Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్‌ప్లస్ సంస్థ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి OnePlus 16, OnePlus 16R అనే రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ ద్వారా భారత వినియోగదారులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. గతంలో కేవలం 16R మోడల్ మాత్రమే వస్తుందని భావించినప్పటికీ, తాజాగా లీకైన నివేదికల ప్రకారం రెండు ఫోన్లు కూడా భారత్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
ధరల విషయానికొస్తే.. OnePlus 16 స్మార్ట్‌ఫోన్ రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే ధర నిర్ణయిస్తే.. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌గా నిలుస్తుంది. ఇక OnePlus 16R ప్రారంభ ధర సుమారు రూ. 70,000 నుంచి రూ. 75,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే లాంచ్ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
- Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
- US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
- Pink Line Metro: దేశంలో తొలి మహిళా మెట్రో.. నేడే ప్రారంభం.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
ఫీచర్ల పరంగా OnePlus 16 అద్భుతమైన స్పెసిఫికేషన్లతో రానుంది. ఇందులో 6.78 అంగుళాల LTPO OLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. కెమెరా విభాగంలో వెనుకవైపు 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాలు ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు. అంతేకాకుండా, 100W వైర్డ్ మరియు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 9000mAh బ్యాటరీ రానుంది. వైర్డ్ ఛార్జింగ్ ద్వారా కేవలం 37 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని తెలుస్తోంది.
మరోవైపు OnePlus 16R మోడల్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 165Hz డిస్ప్లే, మరియు 200MP మెయిన్ కెమెరాతో పాటు 3.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో 7500mAh నుంచి 9000mAh వరకు పెద్ద బ్యాటరీని అమర్చే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్లు భారత్‌లో లాంచ్ అయితే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త సంచలనం సృష్టిస్తాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
-
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
-
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
-
US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!