Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
- అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్, లిస్ట్-A క్రికెట్‌కు..
- వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్..
- బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆట కొనసాగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ ఫస్ట్ క్లాస్, లిస్ట్-A క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున మాత్రం కొనసాగనున్నాడు. 2027-28 సీజన్ వరకు ఆ జట్టుతో అతడి కాంట్రాక్ట్ కొనసాగనుంది. మ్యాక్స్‌వెల్ గతేడాది జూన్‌లోనే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు అందుబాటులో ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. అయితే అనూహ్యంగా టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.
ఫిబ్రవరిలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్ అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్ గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రిటైర్మెంట్ నిర్ణయంపై మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌కు ముందు, తర్వాత జట్టు యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఆస్ట్రేలియా జట్టు నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన సొంత మైదానమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో చివరిసారిగా ఆడే అవకాశం వస్తే బాగుండేదని, అయితే జట్టు భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పాడు.
Also Read
- US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
- Pink Line Metro: దేశంలో తొలి మహిళా మెట్రో.. నేడే ప్రారంభం.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
- Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
- OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
విక్టోరియా తరఫున చివరి వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత సహచర ఆటగాళ్లకు వీడ్కోలు చెప్పడం భావోద్వేగానికి గురిచేసిందని మ్యాక్స్‌వెల్ తెలిపాడు. మోకాలి గాయం కారణంగా చికిత్స, పునరావాసంపై దృష్టి పెట్టాల్సి ఉందన్నాడు. రాబోయే బిగ్‌బాష్ సీజన్లో ఆడేందుకు ఎనిమిది వారాల పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా శ్రమించనున్నట్లు తెలిపాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరఫున 130 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 154.42 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 2,897 పరుగులు చేశాడు. అంతేకాదు 51 వికెట్లు కూడా పడగొట్టాడు. టీ20ల్లో ఐదు సెంచరీలు సాధించాడు. ఈ విషయంలో రోహిత్ శర్మతో కలిసి ప్రపంచ రికార్డును పంచుకుంటున్నాడు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా అతడు ఉన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచినప్పుడు విజయానికి అవసరమైన పరుగులు కూడా మ్యాక్స్‌వెల్ సాధించాడు.
టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మ్యాక్స్‌వెల్ 339 పరుగులు చేశాడు. 2017లో భారత్‌తో రాంచీలో జరిగిన టెస్టులో తన ఏకైక టెస్టు సెంచరీ (104 పరుగులు) నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం మ్యాక్స్‌వెల్ తన ఆటను కొనసాగించనున్నాడు.
ऑस्ट्रेलिया के बिस्फोटक बल्लेबाज Glenn Maxwell ने अंतर्राष्ट्रीय क्रिकेट से संन्यास लिया
मैक्सवेल की ये पारी हमेशा याद की जाएगी https://t.co/cm8zWQ2suO
— Jyotsna yadav (jyoti) (@Jyotsna51400) November 3, 2026
తాజావార్తలు
-
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
-
US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Pink Line Metro: దేశంలో తొలి మహిళా మెట్రో.. నేడే ప్రారంభం.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
ట్రెండింగ్
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!