NTV Telugu Site icon

Imran Khan: భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకి

Imran Khan

Imran Khan

Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. లాహోర్ లో జరిగిన విదేశీ జర్నలిస్టులతో సంభాషిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Taj Mahal: తాజ్‌మహల్‌కు తొలిసారిగా ఇంటి పన్ను నోటీసులు.. రూ.1.4 లక్షలు కట్టాలని ఆదేశం

2019లో భారత్ కాశ్మీర్ హోదాను, ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత ప్రభుత్వం చర్చలకు ముందుకు రాలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ ముందుగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని శాంతి చర్చలు జరపాలని మేం కోరుకుంటున్నామని అన్నారు. అయితే భారతదేశం తరుపున విదేశాంగ విధానం ఎవరు నడుపుతున్నారని పీటీఐ ప్రశ్నించగా.. నేను బాస్ ను నేను విదేశాంగ విధానాన్ని నడుపుతున్నానని ఇమ్రాన్ అన్నారు.

భారత దేశంలో ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గెలవాలని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తను కోరానని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. రైట్ వింగ్ నుంచి వచ్చిన నరేంద్రమోదీ ఈ సమస్యను పరిష్కరిస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నానని అందుకే మళ్లీ ఆయన అధికారంలోకి రావాలని.. కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై ఘాటుగా స్పందించారు. ఆయన విదేశాలు తిరగడం మానేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని అన్నారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయని.. 2600 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొందని అన్నారు. భారతదేశం ఆగస్టు5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Show comments