సౌత్ కొరియాలో కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఓ వింత ఆకారం కనపడింది. దీంతో ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే…తెల్లవారుజామున కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అడ్డంగా ఓ వింతజీవి వచ్చి నిలబడింది. ఆ జీవి వింతగా ప్రవర్తించడంతో డ్రైవర్ అవాక్కై అక్కడే ఆగిపోయాడు. చూడ్డానికి మనిషిలాగే కపిస్తున్న దానికి వెనకాల తోక ఉండటం, కోతిలా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన అమెరికాలో జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వీడియో వైరల్ అవుతోంది.
అది జంతువా లేదంటే మనిషా అని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏఐ క్రియేటెడ్ వీడియో అనుకుంటున్నారు కొందరు. సెప్టెంబర్ 30, 2025 అనే తేదీ వీడియోలో కనిపిస్తుంది.
What the hell is this? 🧐🤔😬😬😬😬
Witness states….👇👇👇👇👇👇👇👇👇👇
I’m an Uber driver (DFW) and I do night into mornings mostly. Nothing ever too out of the ordinary except for the occasional homeless. Tonight however was completely unexpected. It’s exactly 3 am and I’m… pic.twitter.com/kfVek490tP— UFO mania (@maniaUFO) September 30, 2025