Site icon NTV Telugu

Trump-Machado: వైట్‌హౌస్‌కు రానున్న వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో.. ఏం జరుగుతోంది?

Venezuelan Opposition Leade

Venezuelan Opposition Leade

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నికోలస్ మదురోను అమెరికాకు తరలించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. కానీ ఆమెతో అమెరికాకు మంచి సంబంధాలు లేనట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి గ్రహీత మచాడోను అమెరికా రంగంలోకి దింపుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం మచాడో వాషింగ్టన్ వస్తున్నట్లుగా ట్రంప్ తెలియజేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల మచాడో మాట్లాడుతూ.. ట్రంప్‌తో కలిసి పనిచేసే ఆలోచన లేదని తోసిపుచ్చారు. గతేడాది అక్టోబర్‌లో నోబెల్ ఫ్రైజ్ గెలిచినప్పుడే ట్రంప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మళ్లీ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఇక మదురోను అమెరికా కిడ్నాప్ చేశాక చాలా సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా తీరును ప్రశంసించారు. ఇప్పుడు నేరుగా ట్రంప్‌ను కలిసేందుకు వచ్చే వారం వాషింగ్టన్ వెళ్తున్నారు. ఆమె రాకతో వెనిజులా ఎలాంటి పరిణామాలు మారతాయో చూడాలి.

గత శనివారం వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా సైన్యం దాడి చేసి నికోలస్ మదురోను అపహరించుకుని తీసుకెళ్లిపోయారు. అనంతరం డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ప్రస్తుతం అమెరికానే పెత్తనం చెలాయిస్తోంది. చమురును స్వాధీనం చేసుకుంటామని.. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనిజులా, అమెరికాకు ఖర్చు చేస్తానని ఇటీవల ట్రంప్ వెల్లడించారు.

 

Exit mobile version