NTV Telugu Site icon

Recession: ఆర్థికమాంద్యం తప్పదు.. యూఎస్ ట్రెజరీ వార్నింగ్.. భారత ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలమే..!

Recesssion

Recesssion

Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.

ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని యూఎస్ ట్రెజరీ హెచ్చరించింది. దీంతో పాటు అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోత ఉంటుందని తెలిపింది. అమెరికాలో మొత్తంగా 5,85,000 కంటే ఎక్కువ టెక్ కంపెనీ ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం యూఎస్ లో 4.4 మిలియన్లకు పైగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపుగా 30-40 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరందరూ గడ్డుకాలం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సగటు భారతీయుడి డాలర్ డ్రీమ్స్ దెబ్బతిననున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత గురించి హెచ్చరించారు.

Read Also: Vemula Prashanth Reddy : బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు

కొన్ని వారాల క్రితం అమెరికా పాలసీమేకర్స్, బ్యాంకర్లు, వైట్ హౌజ్ అధికారులు అమెరికా డిఫాల్ట్ కౌగిలి ఉందని చెప్పారు. ఆర్థికమాంద్యంతో అమెరికాను దెబ్బకొట్టే అవకాశం ఉందని, ఇది ప్రపంచానికి అంటువ్యాధిగా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయంపై ప్రస్తుత పరిమితులను పెంచాడానికి చట్టసభ సభ్యులు బైడెన్ ఒప్పందాన్ని అంగీకరించలేకపోతే జూన్ 15 నాటికి అమెరికాలో అప్పుల ఎగవేత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెసెన్షియల్ బడ్జెట్ ఆఫీస్ శుక్రవారం అంచనా వేసింది.

రుణ పరిమితిని పెంచడంపై డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడియోమో మాట్లాడుతూ.. డిఫాల్ట్ సమయానికి రుణపరిమితిని పెంచకుంటే డిఫాల్ట్ అవుతారని, మాంద్యంలోకి వెళ్తామని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ రుణపరిమితిని పెంపును పెంచాలని అనుకుంటున్నారు. మార్చిలో బైడెన్ బడ్జెట్ అభ్యర్థనను ప్రస్తావిస్తూ.. 10 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్ల రుణ ఉపశమనాన్ని కలిగి ఉన్న ప్లాన్ రూపొందించారని అడెమో చెప్పారు. రుణపరిమితిని అధిగమించేందుకు, దేశం డిఫాల్ట్ లోకి వెళ్లకుండా నిరోధించడానికి చట్ట సభ్యులు మార్గాలను అణ్వేషించాలని ఆయన అన్నారు. ఒక వేళ ఈ రుణఎగవేతలు దేశంలో లక్షలాది ఉద్యోగాలు పోయేందుకు కారణమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. భారీ మాంద్యం ప్రభావం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం ఉందని నిపుణులు భావిస్తున్నారు.