Ukraine War: అణుదాడికి సంకేతాలు ఏమి లేవు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.
Read Also: Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని సియోనిలో భూకంపం.. తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
రష్యా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఎలాంటి సూచనలు లేవని జిన్ పియర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా క్రూరంగా దాడి చేసిందని, రష్యా దురాక్రమణ నుంచి తమ ప్రజలను, భూ భాగాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇస్తామన్నారు.
బుధవారం రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. ఆ దేశ అణ్వాయుధ శక్తిని ప్రశంసించారు. తమ దేశానికి ముప్పు వాటిల్లితే అణు ఆయుధాలను మోహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. రష్యాలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అమెరికా అభిప్రాయపడుతోంది. మరో ఆరేళ్ల పాటు అధికారంలో ఉండేందుకు పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కి మద్దతుగా మరో 300 మిలియన్ డాలర్ల అత్యవసర ఆయుధ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు మంగళవారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. అయితే, యూఎస్ కాంగ్రెస్ దీన్ని అడ్డుకుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!