చాలా మంది అమెరికాలో చదువుకోవాలని.. అక్కడ స్థిరపడాలని కలలు కంటారు. కానీ పరిస్థితులు.. ఒకప్పటిలాగా లేవు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసలపై కఠినమైన ఆంక్షలు పెట్టారు. అంతెందుకు విద్యార్థుల చదువులపై కూడా ఆంక్షలు పెట్టారు. దీంతో అమెరికా వెళ్లాలంటే మామూలు విషయం కాదు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కుప్పంలో మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!
ఇదిలా ఉంటే అమెరికాలో స్థిర నివాసం కోసం చాలా మంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు లాటరీ గురించి తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఈ లాటరీ ద్వారా ప్రతి ఏటా 55 వేల మందికి శాశ్వత నివాసాన్ని అమెరికా ఇస్తుంటుంది. ఎవరికి ఈ కార్డులు ఇస్తుంది. భారతీయులకు అవకాశం ఉందా? తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇమ్మిగ్రేషన్ రేటు తక్కువ ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసీ (డీఏ) ప్రోగ్రామ్ ద్వారా 55 వేల ఇమ్మిగ్రెంట్ వీసాలను అమెరికా ప్రతి సంవత్సరం అందిస్తుంది. రాండమ్ పద్ధతిలో ఈ ఎంపిక జరుగుతుంది. ఈ డ్రా అక్టోబర్‌లో ఓపెన్ అవుతుంది. నవంబర్‌లో ముగుస్తుంది.
ఇది కూడా చదవండి:Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న..
ఇక గ్రీన్ కార్డ్ లాటరీలో పేరు వచ్చినంత మాత్రాన శాశ్వత నివాస హోదా దక్కదు. అనంతరం అధికారులతో ఇంటర్వ్యూ, మెడికల్ చెకప్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక ఇస్తారు. అంతేకాకుండా గత ఐదేళ్లలో ఏ దేశం నుంచైతే 50 వేల మందికిపైగా వలసదారులు అమెరికాలోకి వచ్చి ఉంటారో.. ఆ ప్రాంత ప్రజలకు గ్రీన్ కార్డు లాటరీలో పాల్గొనే అర్హత లేదు. వారికి ఎలాంటి అవకాశాలు ఉండవు. ఇక ఈ గ్రీన్ కార్డు లాటరీకి కేవలం ఒక్కసారి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అంతకు మించి ఎంట్రీ ఇస్తే.. ఆటోమెటిక్‌గా అనర్హులవుతారు. ఇక ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వైబ్‌సైట్‌లో గ్రీన్ కార్డ్ లాటరీకి అప్లై చేయాలి.
ఇక అమెరికా విడుదల చేసిన గ్రీన్ కార్డు లాటరీ ఎలిజిబులిటీ లిస్టులో భారత్ పేరు లేదు. దీనికి ఇండియా నుంచి అత్యధిక మంది అమెరికాకు వెళ్లడమే కారణం. అమెరికా విడుదల చేసిన దేశాల వారే అప్లై చేసుకోవాలి. లిస్ట్‌లో ఉన్న దేశాల్లో పుట్టిన భారతీయులు మాత్రం అప్లై చేసుకునే వెసులబాటు ఉంది.
ఇక అర్హత కలిగిన దేశాలు ఇవే..
దక్షిణాఫ్రికా, దక్షిణ సూడాన్, సూడాన్, టాంజానియా, టోగో, ట్యునీషియా, ఉగాండా, జాంబియా, జింబాబ్వే, అల్జీరియా, అంగోలా, బెనిన్, బోట్స్‌వానా, బుర్కినా ఫాసో, బురుండి, కామెరూన్, కాబో వెర్డే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, కొమొరోస్, కాంగో, ఐవరీ కోస్ట్, జిబౌటి, ఈజిఫ్ట్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, ఎస్వాటిని, ఇథియోపియా, గాబన్, గాంబియా, ఘనా, గినియా, గినియా-బిస్సావు, కెన్యా, లెసోతో, లైబీరియా, లిబియా, మడగాస్కర్, మాలావి, మాలి, మౌరిటానియా, మారిషస్, మొరాకో, మొజాంబిక్, నమీబియా, నైజర్, రువాండా, సావో టోమ్, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా.