అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.
చాలా మంది అమెరికాలో చదువుకోవాలని.. అక్కడ స్థిరపడాలని కలలు కంటారు. కానీ పరిస్థితులు.. ఒకప్పటిలాగా లేవు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసలపై కఠినమైన ఆంక్షలు పెట్టారు.