Site icon NTV Telugu

Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. మరోసారి ట్రంప్ ప్రకటన

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోసారి కూడా అవే వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను తిరిగి గాజాను రానివ్వమని.. అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసి ఇస్తామని ట్రంప సంచలన ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: నేడు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు మోడీ.. ట్రంప్‌తో సమావేశం

మా ఆధ్వర్యంలో గాజాను పునర్‌ నిర్మించే బాధ్యతను ఇతరులకు అప్పగించవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. మొత్తానికి తాము గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. హమాస్‌ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. హమాస్‌, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

గాజాలో ఉన్న పాలస్తీనియన్లను ముందుగా వేరే ప్రాంతానికి తరలిస్తామని.. అక్కడే వారికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం గాజాలో అమెరికా బలగాలను దించి.. పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మనుపటిలాగా కాకుండా గాజాలో మంచి ఇళ్లు నిర్మిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: Automated Fitness Test : ఆటోమేటిక్ ఫిట్‌నెస్ పరీక్ష అంటే ఏమిటి.. ఇది వాహనాలకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది ?

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనియన్ల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అరబ్ దేశాలతో పాటు మిత్ర దేశాలు ఈజిప్ట్, జోర్డాన్ దేశాలు ఖండిస్తున్నాయి. ఇలా అయితే పశ్చిమాసియా పరిస్థితి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. ఇక ఇజ్రాయెల్‌–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Salman khan: ఎప్పటికీ నేర్చుకోలేని విషయాలు చాలా ఉన్నాయి : సల్మాన్ ఖాన్

Exit mobile version