అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పేరు మీద ఉన్న ‘ట్రంప్-క్లాస్’ యుద్ధ నౌకలను ఆవిష్కరించారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలుగా పేర్కొన్నారు. ఈ నౌకలు అమెరికా నావికా ఆధిపత్యాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద యుద్ధనౌకలుగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Maharashtra: స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం అలర్ట్.. రాహుల్‌గాంధీతో కీలక చర్చలు
ఫ్లోరిడాలోని ట్రంప్ మార్-ఎ-లాగో నివాసం నుంచి నౌకలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, నేవీ కార్యదర్శి జాన్ ఫెలాన్ ఉన్నారు. నౌకల చిత్రాలు ప్రదర్శించారు. ఈ నౌకలు 30,000 నుంచి 40,000 టన్నుల బరువును స్థానభ్రంశం చేస్తాయని.. క్షిపణులు, తుపాకులు, లేజర్‌లు, హైపర్‌సోనిక్ క్షిపణులతో సహా ఇంకా అధునాతన ఆయుధాలను కలిగి ఉంటాయని ట్రంప్ అన్నారు. మొదట్లో రెండు నౌకలను ప్లాన్ చేస్తున్నారని.. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇవి అత్యంత ప్రాణాంతకమైన యుద్ధ నౌకలుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: పవన్ ట్రాప్ లో పడకుండా వైసీపీ నాయకుల వ్యూహాత్మక జాగ్రత్తలు?
ఈ యుద్ధ నౌకలు ఐయోవా తరగతి నౌకలు కంటే 100 రెట్లు శక్తివంతమైనవి. బీజింగ్‌కు ధీటుగా ఈ యుద్ధ నౌకలు నిర్మించాలని అమెరికా నావికాదళం భావించింది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ నౌకలు నిర్మిస్తున్నారు. ఇక విక్రేత విషయంలో 2030లో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం అమెరికానే ఫస్ట్.. ఆ తర్వాతే ఇతర దేశాలకు విక్రయించనున్నారు.
BREAKING: Pres. Trump announces "a plan for the Navy to begin the construction of two brand new, very large battleships."
"They'll be the fastest, the biggest, and by far. 100 times more powerful than any battleship ever built." pic.twitter.com/lkl8pdSgpM
— Breaking911 (@Breaking911) December 22, 2025