Site icon NTV Telugu

US: అమానుషం.. భారతీయ విద్యార్థికి బేడీలు.. వీడియో వైరల్

Indianstudent

Indianstudent

అమెరికా పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక భారతీయ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టూడెంట్‌ను కింద పడేసి చేతులకు బేడీలు వేసి నేలకు నొక్కిపెట్టారు. అనంతరం అతడిపై ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. దీంతో ఆ విద్యార్థి నొప్పితో విలవిలలాడిపోయాడు. మొత్తం నలుగురు అధికారులు అతన్ని పట్టుకున్నారు. చాలాసేపు అతని వీపుపైనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: Minister Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్.. ఆధునిక ప్లాంట్లను సందర్శించిన మంత్రి నారాయణ..!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని నేరస్థుడిలా పట్టుకోవడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే.. పంపించేయాలి కానీ  ఇలా సంకెళ్లు వేయడమేంటి? అని నిలదీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!

‘‘నిన్న రాత్రి న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారత యువ విద్యార్థిని బహిష్కరించడాన్ని చూశాను. చేతులకు బేడీలు వేయడంతో ఏడుస్తూ కనిపించాడు. ఒక ఎన్నారైగా నిస్సహాయంగా, హృదయ విదారకంగా ఉండిపోయాను.’’ అని భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు కునాల్ జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై దర్యాప్తు చేసి విద్యార్థికి సహాయం అందించాలని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు.

ఉగ్రవాదులతో కూడా ఇలాంటి ప్రవర్తనను తానెప్పుడూ చూడలేదని కునాల్ జైన్ అన్నారు. చుట్టూ దాదాపు 50 మంది ఉన్నారని.. కానీ ఎవరూ సాయం చేయడానికి ధైర్యం చేయలేదన్నారు. హింసించడంతో విద్యార్థి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయినట్లుగా భావించానన్నారు. విద్యార్థి హిందీలో మాట్లాడడం వల్ల అధికారులకు అర్థం కాలేదని.. దీంతో సహాయం చేయమంటారా? అని ఒక అధికారిని అడిగానని.. కానీ అందుకు ఆ అధికారి ఒప్పుకోలేదని జైన్ అన్నారు.

 

Exit mobile version