US: అమానుషం.. భారతీయ విద్యార్థికి బేడీలు.. వీడియో వైరల్
- అమెరికా పోలీసులు అమానుషం
- భారతీయ విద్యార్థికి బేడీలు
- వీడియో వైరల్.. ఎన్నారైలు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక భారతీయ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టూడెంట్‌ను కింద పడేసి చేతులకు బేడీలు వేసి నేలకు నొక్కిపెట్టారు. అనంతరం అతడిపై ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. దీంతో ఆ విద్యార్థి నొప్పితో విలవిలలాడిపోయాడు. మొత్తం నలుగురు అధికారులు అతన్ని పట్టుకున్నారు. చాలాసేపు అతని వీపుపైనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Minister Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్.. ఆధునిక ప్లాంట్లను సందర్శించిన మంత్రి నారాయణ..!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని నేరస్థుడిలా పట్టుకోవడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే.. పంపించేయాలి కానీ ఇలా సంకెళ్లు వేయడమేంటి? అని నిలదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!
‘‘నిన్న రాత్రి న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారత యువ విద్యార్థిని బహిష్కరించడాన్ని చూశాను. చేతులకు బేడీలు వేయడంతో ఏడుస్తూ కనిపించాడు. ఒక ఎన్నారైగా నిస్సహాయంగా, హృదయ విదారకంగా ఉండిపోయాను.’’ అని భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు కునాల్ జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై దర్యాప్తు చేసి విద్యార్థికి సహాయం అందించాలని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు.

ఉగ్రవాదులతో కూడా ఇలాంటి ప్రవర్తనను తానెప్పుడూ చూడలేదని కునాల్ జైన్ అన్నారు. చుట్టూ దాదాపు 50 మంది ఉన్నారని.. కానీ ఎవరూ సాయం చేయడానికి ధైర్యం చేయలేదన్నారు. హింసించడంతో విద్యార్థి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయినట్లుగా భావించానన్నారు. విద్యార్థి హిందీలో మాట్లాడడం వల్ల అధికారులకు అర్థం కాలేదని.. దీంతో సహాయం చేయమంటారా? అని ఒక అధికారిని అడిగానని.. కానీ అందుకు ఆ అధికారి ఒప్పుకోలేదని జైన్ అన్నారు.
I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025
We have come across social media posts claiming that an Indian national is facing difficulties at Newark Liberty International Airport. We are in touch with local authorities in this regard.
The Consulate remains ever committed for the welfare of Indian Nationals.@MEAIndia…
— India in New York (@IndiainNewYork) June 9, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!