Site icon NTV Telugu

US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి?

Nicolas Maduro

Nicolas Maduro

US-Venezuela War: వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాలతో పాటు రష్యా, ఇరాన్‌లు దాడులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

Read Also: Dhurandhar: దురంధర్ ‘‘మాస్టర్ పీస్’’.. సూర్య, జ్యోతిక ప్రశంసలు..

ఇదిలా ఉంటే, మదురోపై అమెరికాలో న్యాయ విచారణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆయన వెనిజులా ప్రెసిడెంట్ కారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. అమెరికా అటార్నీ జనరల్ ముదురోను వాషింగ్టన్ కోర్టు ముందు ప్రవేశపెడుతామని చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మదురోకు డ్రగ్స్ కార్టెల్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదురోపై ‘‘నార్కో-టెర్రరిజం’’ కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version