Trump: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, వారిని అమెరికాకు తీసుకువచ్చారు. అయితే, అమెరికా చేసిన ఈ దాడిని ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు, వెనిజులా అమెరికాలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోందని, మదురోకు ఈ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల చెబుతున్న దాని ప్రకారం, ట్రంప్ వెనిజులా ఆయిల్, ఇతర ఖనిజ సంపదపై కన్నేసి ఈ దుందుగుకు చర్యలకు పాల్పడ్డారని అంటున్నారు.…
US-Venezuela War: వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాలతో పాటు రష్యా, ఇరాన్‌లు…