US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మంగళవారం మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్న వేళ హార్ముజ్ దగ్గర ఆత్మ రక్షణ దాడులు చేసినట్లుగా అమెరికా తెలిపింది. ఇరాన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి, తమ బలగాలను రక్షించుకోవడానికే దక్షిణ ఇరాన్లో ఆత్మరక్షణ దాడులు చేసినట్లు యూఎస్ వెల్లడించింది. దీంతో ప్రశాంతంగా ఉన్న మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో ఇరాన్ మరోసారి ప్రతీకారంతో రగిలిపోతుంది.
అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా దక్షిణ హార్మోజ్గాన్ ప్రాంతంలో అమెరికా సైన్యం దూకుడు చర్యలకు పాల్పడిందని, ఇరాన్ వాణిజ్య నౌకలపై సముద్ర దోపిడీ చర్యలు చేపట్టిందని ఇరాన్ విదేశాంగ శాఖ మండిపడింది. 2026 ఏప్రిల్ 19న కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా అమెరికా అక్రమ, అన్యాయ చర్యలను కొనసాగిస్తోందని ఇరాన్ ఆరోపించింది. గత 48 గంటల్లో హార్మోజ్ ప్రాంతంలో జరిగిన చర్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఘోర ఉల్లంఘన అని పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సముద్ర దోపిడీ చర్యలకు పాల్పడిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
- Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
- Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
ఇదే సమయంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో దౌత్య చర్చలు కొనసాగుతుండగా అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం.. వాషింగ్టన్ పాలకుల ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టిందని ఇరాన్ విమర్శించింది. “అమెరికా ఇచ్చిన హామీలకు విలువ లేదని, ఇరాన్ ప్రజలపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని ఈ ఘటనలు నిరూపించాయి” అని పేర్కొంది. అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2, ప్యారాగ్రాఫ్ 4కు స్పష్టమైన ఉల్లంఘన అని ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల వల్ల కలిగే పరిణామాలకు అమెరికానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
“ఇరాన్‌పై జరిగే ఏ దుష్ట చర్యనూ మేము ఉపేక్షించము. దేశ రక్షణ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయము” అంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా అణు చర్చల్లో కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజా శాంతి చర్చల్లో భాగంగా యురేనియంను విదేశాలకు తరలించే ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు సెమీ-అధికారిక తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం ఇంకా సంక్లిష్ట దశలోనే కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!