Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీపై రవిశాస్త్రి ప్రశంసలు
- మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి మొక్క నాటిన ఫొటోను షేర్ చేసిన మాజీ క్రికెటర్
- “ఇలాంటి అంతర్జాతీయ దౌత్యాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు” అంటూ వ్యాఖ్య
- “భారతీయుడిగా ఇంతకంటే గర్వంగా ఎప్పుడూ అనిపించలేదు” అని రవిశాస్త్రి పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో సహా మొత్తం 11 సభ్యదేశాల అధినేతలో పాటు మరో 10 భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.
అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, జిన్‌పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దిగ్గజ నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సంచలనంగా మారింది. ఈ బ్రిక్స్ సదస్సుపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. మోడీ, జిన్‌పింగ్, పుతిన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, మోదీ దౌత్య విజయాన్ని కొనియాడారు.
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
‘‘భారతీయుడిగా ఇంతకన్నా గర్వంగా ఎప్పుడూ అనిపించలేదు. అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు షీ, మన అద్భుతమైన ప్రధాని నరేంద్ర మోదీ.. మాతృభూమి భారత్‌లో కలిసి ఉన్నారు. ఇలాంటి అంతర్జాతీయ దౌత్యాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. మోదీజీకి సెల్యూట్’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బ్రిక్స్ సమావేశాలు విజయవంతమయ్యాయి. రష్యా, చైనా అధ్యక్షులతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆదివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో పాటు కజకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, బురుండి, ఉగాండా, నైజీరియా దేశాల నేతలతో మోడీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల నేతలు శనివారం ఏకగ్రీవంగా “న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026”ను ఆమోదించారు.
Never felt prouder as an Indian. President Putin. President Xi. And our Magnificent Prime Minister Narendra Modi together in Mother India. International diplomacy like never before. Take a Bow. Modi Ji pic.twitter.com/RfINH8SiAB
— Ravi Shastri (@RaviShastriOfc) September 12, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?