One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇగ్నో జూలై 2026 విద్యా సంవత్సరం నుంచి డెవలప్మెంట్ స్టడీస్ (Development Studies) విభాగంలో ఒక సంవత్సర కాలపరిమితితో నూతన ఎంఏ కార్యక్రమాన్ని ప్రకటించింది. సాధారణంగా మాస్టర్ డిగ్రీకి రెండేళ్లు పడుతుంది కానీ, ఈ కోర్సు పన్నెండు నెలల్లోనే పూర్తవుతుంది. ఇగ్నోలోని స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ రూపొందించిన ఈ కోర్సు మొత్తం 40 క్రెడిట్లతో ఉంటుంది. ఏదైనా విభాగంలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినవారు, లేదా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో 4-5 ఏళ్ల డిగ్రీ ఉన్నవారు, అలాగే 4 ఏళ్ల బీఈడీ లేదా బీటెక్ చేసినవారు దీనికి అర్హులు.
ఈ కోర్సు రెండు సెమిస్టర్లలో 20-20 క్రెడిట్ల చొప్పున మొత్తం 40 క్రెడిట్లతో ఉంటుంది. మొదటి సెమిస్టర్లో అభివృద్ధి ప్రాథమిక సిద్ధాంతాలు, ప్రస్తుత అంశాలు, గతిశీలత, సవాళ్లు నేర్పుతారు. రెండో సెమిస్టర్లో రీసెర్చ్ మెథడాలజీ తప్పనిసరిగా ఉండి, జెండర్ స్టడీస్, ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్, ట్రైనింగ్, లోకల్ సెల్ గవర్నెన్స్, హెల్త్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అర్బన్ డెవలప్మెంట్ వంటి ఆప్షనల్ సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. కేవలం సిద్ధాంతమే కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలకు కూడా పెద్దపీట వేయడంతో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, సీఎస్ఆర్ ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
Also Read
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ఈ ఒక ఏడాది ఎంఏ కోర్సు మొత్తం ఫీజు కేవలం రూ.8,000 మాత్రమే. జూలై 2026 సెషన్ కోసం ఆన్లైన్ ప్రవేశ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇగ్నో జనవరి, జూలై సెషన్లలో ప్రవేశాలు కల్పిస్తుంది కాబట్టి తక్కువ ఖర్చులో త్వరగా మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. పూర్తి వివరాలకు https://www.ignou.ac.in/ సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!