Iran War: సౌదీలో ఇరాన్ విధ్వంసం.. రూ. 6000 కోట్ల విలువైన అమెరికా విమానం నాశనం..
- అమెరికాను దెబ్బ కొట్టిన ఇరాన్..
- సౌదీ అరేబియా యూఎస్ బేస్‌పై అటాక్..
- రూ. 6 వేల కోట్ల విలువైన అవాక్స్ విమానం ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై యూఎస్ వైమానిక దాడులకు అత్యంత కీలకమైన విమానాన్ని ఇరాన్ నాశనం చేసింది. శుక్రవారం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై తాము జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా సైనిక ఆస్తులతో పాటు E-3 AWACS(ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) కమాండ్ అండ్ కంట్రోల్ విమానం నాశనమైంది. దీంతో పాటు అనేక ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు కూడా దెబ్బతిన్నాయి.
ఇరాన్ ప్రెస్ విడుదల చేసిన ఫోటోల్లో విమానం మధ్య భాగం నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది. ఈ దాడికి ఆరు బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ఉపయోగించినట్లు సమాచారం. ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికన్ సైనికులు గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటికే అమెరికాకు చెందిన ఒక MQ-9 డ్రోన్‌ను కూల్చివేసి, ఒక F-16 జెట్‌ను కూల్చినట్లు ఇరాన్ పేర్కొంది.
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, దాడికి ముందు ఆ స్థావరంలో సుమారు ఆరు E-3 సెంటినల్ విమానాలను అమెరికా మోహరించింది. ఇది వైమానిక ముప్పును గుర్తించడానికి ఉపయోగించే నిఘా విమానం. ధ్వంసమైన విమానం విలువ సుమారుగా $700 మిలియన్లు (రూ. 6600 కోట్లు) ఉంటుందని అంచనా.
ఈ విమానం ప్రత్యేకతలు ఏమిటి.?
E-3 సెంటినల్ విమానాన్ని అమెరికా వైమానిక కార్యకలాపాలకు వెన్నెముకగా పరిగణిస్తారు. ఇది గాలిలో ఉంటూనే శత్రుదేశాల వైమానిక ముప్పును ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. అమెరికా వైమానిక దళానికి నిఘా, పర్యవేక్షణ, గూఢచర్యం వంటి కీలక సామర్థ్యాలను అందిస్తుంది. 1970ల నుండి సేవలో ఉన్న ఈ విమానం, ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్, కొసావో యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్లతో సహా ఆపరేషన్ ఇన్హెరెంట్ రిసాల్వ్ వంటి అనేక ప్రధాన సైనిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది.
గాలిలోనే ఉంటూ గగనతలంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వివిధ యుద్ధ విమానాలను సమన్వయం చేస్తుంది. అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, సౌదీ అరేబియా వంటి అనేక ఇతర దేశాల సైన్యాలు కూడా దీనిని ఉపయోగిస్తున్నాయి. ఈ విమానం ధ్వంసమవ్వడం అమెరికాకు గట్టి దెబ్బగా నిపుణులు భావిస్తున్నారు.
Newly released images capture the damage caused to an American E-3 AWACS plane in Iranian retaliatory strikes on Prince Sultan Air Base in Saudi Arabia.
Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/ftFLmC5wuB
— Press TV 🔻 (@PressTV) March 29, 2026
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!