Site icon NTV Telugu

Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతిపై పుతిన్ 5 గంటలు చర్చలు.. చివరికి తేలిందిదే!

Putin

Putin

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతినిధులు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాస్కోలో పుతిన్‌తో అమెరికా దౌత్యవేత్తలు సమావేశం అయ్యారు. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడి అల్లుడు జారెడ్ కుష్నర్ దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిపారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. ఈ మేరకు క్రెమ్లిన్ ప్రతినిధి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi-Congress: మోడీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్‌పై టీ అమ్ముతున్నట్లుగా పోస్ట్

ఇక చర్చల తర్వాత పుతిన్ యూరోపియన్ దేశాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. యుద్ధం కోరుకుంటే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో సవరణలపై జెలెన్‌స్కీ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర

 

Exit mobile version