PM Modi-Congress: మోడీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్‌పై టీ అమ్ముతున్నట్లుగా పోస్ట్
- మోడీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో
- రెడ్ కార్పెట్‌పై టీ అమ్ముతున్నట్లుగా పోస్ట్
- ప్రధానిని కాంగ్రెస్ అవమానించిందంటూ బీజేపీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం భారత్ ఏర్పాట్లు చేస్తోంది. పుతిన్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఒక వివాదాస్పద వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
పుతిన్ కోసం భారత్ రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసింది. అయితే రెడ్ కార్పెట్‌పై ప్రధాని మోడీ టీ అమ్ముతున్నట్లుగా ఏఐ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోడీని కాంగ్రెస్ మరోసారి అగౌరవపరిచిందని బీజేపీ ధ్వజమెత్తింది.
ఈ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ పోస్ట్ చేశారు. ‘‘ఇప్పుడు.. ఇది ఎవరు చేసారు?’’ అంటూ క్యాప్షన్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక వీడియోలో ప్రధాని మోడీ లేత నీలం రంగు కోటు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నారు. కెటిల్, టీ గ్లాసులు చేత్తో పట్టుకుని రెడ్ కార్పెట్‌పై పిలుస్తున్నట్లుగా కనిపించారు. అంతర్జాతీయ జెండాలు, త్రివర్ణ పతాకం వీడియోలో కనిపించింది. మోడీ … ‘‘చాయ్ బోలో.. చాయ్యే (ఎవరికైనా టీ కావాలా)’’ అంటూ మోడీ అరుస్తున్నట్లుగా గొంతు వినబడింది.
ఇది కూడా చదవండి: Gaza: గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో మోడీపై ఏఐ వీడియో క్రియేట్ చేసింది. పెద్ద ఎత్తున ఓట్ల చోరీ చేసుకొచ్చానని మంచంపై పడుకుంటారు. అనంతరం తల్లి హీరాబెన్ కలలో ప్రత్యక్షమై ఓట్ల చోరీపై మోడీని గద్దించినట్లుగా వీడియోలో కనిపించింది. అప్పట్లో ఈ వీడియో తీవ్ర దుమారం రేగింది. తాజాగా పుతిన్ భారత్‌కు వస్తున్న సమయంలో అదే తరహాలో కాంగ్రెస్ ఏఐ వీడియో విడుదల చేయడంపై కమలనాథులు మండిపడుతున్నారు.
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025
- Tags
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!