US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?
- సొంత యుద్ధవిమానాలను పేల్చేసిన యూఎస్..
- ఇరాన్‌లో పైలట్ రెస్క్యూ సమయంలో ఘటన..
- ఎందుకు పేల్చేసిందని అందరిలో ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పైలట్‌ను అమెరికా బలగాలు విజయవంతంగా రెస్క్యూ చేశాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటపడ్డాడు. ఇలా బయటకి వచ్చిన పైలట్‌ను రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్‌లో అమెరికా సైన్యం తన సొంత యుద్ధ విమానాలను పేల్చేసింది.
Read Also: Basara Temple : బాసర టెంపుల్ నమూనా.. మీరు చూశారా.?
Also Read
- Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. "జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం".. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
- Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
- Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
ఇలా సొంత విమానాలను అమెరికా ఎందుకు పేల్చేసిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన రెండు ఎంసీ-130జే కమాండో-2 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు పేల్చేసింది. ఆపరేషన్ సమయంలో ఇందులో సమస్యలు ఏర్పడటం, శత్రు ప్రాంతంలో చిక్కుకుపోవడం, తిరిగి తీసుకురావడం అసాధ్యంగా మారడంతో అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. శత్రు దేశాల చేతుల్లో తమ టెక్నాలజీ చేరకుండా ఉండటానికి ఇలా పేల్చేసింది. కమ్యూనికేషన్స్, నావిగేషన్ సిస్టమ్స్, స్పెషల్ ఆపరేషన్ టెక్నాలజీ వంటికి ఇరాన్‌కు చేరితే ప్రమాదకరమని యూఎస్ భావించింది.
ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ సమయంలో అనేక అమెరికా విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) తెలిపింది. అమెరికాకు చెందిన సీ-130 ట్రాన్స్‌పోర్ట్ విమానం దక్షిణ ఇస్ఫహాన్‌లో కూల్చేసినట్లు చెప్పింది. దీంతో పాటు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది.ఇదిలా ఉంటే, ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ ఇన్‌స్టాలో ధ్వంసమైన యూఎస్ విమానాలను పోస్ట్ చేసి, అమెరికాకు ఇలాంటి మరో మూడు జరిగితే నాశనమవ్వడం ఖామయని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
-
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్‌గా అనిల్ రావిపూడి!
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్‌కు నో చెప్పిన ధర్మాసనం.!
-
Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!