US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- ఏఐ నుంచి తైవాన్ వరకు
- ట్రంప్-జిన్‌పింగ్ చర్చల్లో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Xi Jinping White House Dinner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తైవాన్ తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. షీ జిన్‌పింగ్, పెంగ్ లియువాన్‌లకు వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్టేట్ డిన్నర్‌కు అమెరికా వ్యాపార, టెక్నాలజీ, మీడియా, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
డిన్నర్‌కు టెక్ దిగ్గజాల హాజరు
వైట్‌హౌస్ విందులో టెక్నాలజీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యాపిల్ మాజీ సీఈవో టిమ్ కుక్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, జూమ్ సీఈవో ఎరిక్ యువాన్, టిక్‌టాక్ ఇన్వెస్టర్ జెఫ్ యాస్ తదితరులు ఈ కార్యక్రమంలో కనిపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, టెక్నాలజీ వాణిజ్యం వంటి అంశాలు అమెరికా-చైనా సంబంధాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో టెక్ రంగ ప్రముఖుల హాజరు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
ఆర్థిక, వ్యాపార రంగాల ప్రముఖులు
వాల్‌స్ట్రీట్‌కు చెందిన ప్రముఖ సంస్థల అధిపతులు కూడా విందుకు హాజరయ్యారు. జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ సాక్స్ సంస్థల సీఈవోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే లగ్జరీ రంగ దిగ్గజ సంస్థ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. మీడియా రంగం నుంచి ఫాక్స్ న్యూస్‌కు చెందిన బ్రెట్ బేయర్, లారా ఇంగ్రహామ్, పారామౌంట్ స్కైడాన్స్ సీఈవో డేవిడ్ ఎల్లిసన్ తదితరులు హాజరయ్యారు.
ప్రత్యేక ఆకర్షణగా డిన్నర్ మెనూ
వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక విందులో స్క్వాష్, వైల్డ్ మష్రూమ్స్, క్రిస్పీ పాన్‌సెట్టా వంటి పలు వంటకాలను అందించినట్లు సమాచారం. విందుకు ముందు ట్రంప్, జిన్‌పింగ్ ఇద్దరూ ప్రసంగాలు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య వ్యక్తిగత సంబంధాలను అమెరికా అధ్యక్షుడు గతంలో సానుకూలంగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో సంబంధాలకు ఈ సమావేశం ప్రాధాన్యతను చూపించినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.
ట్రంప్ ప్రభుత్వంపై డెమొక్రాట్ల విమర్శలు
ఇదిలా ఉండగా, అమెరికా డెమొక్రటిక్ పార్టీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. తైవాన్ భద్రత, చైనాతో వాణిజ్య సంబంధాలు వంటి కీలక అంశాల కంటే ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని వారు ఆరోపించారు. తైవాన్‌కు తక్షణ సాయం, ఆయుధాల సరఫరా వంటి అంశాలతో పాటు చైనాకు అధునాతన చిప్‌ల విక్రయంపై ఉన్న ఆంక్షలకు సంబంధించిన నిర్ణయాలను కూడా కొంతమంది డెమొక్రటిక్ నేతలు ప్రశ్నించారు. అమెరికా-చైనా మధ్య ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక-రాజకీయ సంబంధాలు సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం, అనంతరం జరిగిన వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!