Site icon NTV Telugu

Russia-Ukraine war: మొదలైన శాంతి చర్చలు.. ఉక్రెయిన్ లేకుండానే చర్చలు

Russiaamerica

Russiaamerica

రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల క్రితం మొదలైన యుద్ధానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇటీవల ట్రంప్ దాదాపు 90 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం ఈ శాంతి చర్చలకు పునాది పడింది. సౌదీ అరేబియా వేదికగా ఈ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా-రష్యా అధికారులు చర్చలు ప్రారంభించారు. విచిత్రమేంటంటే.. ఈ చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధి లేకుండానే మొదలయ్యాయి. చర్చల్లో భాగంగా అమెరికా-రష్యా సంబంధాలు మెరుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తమ వెనుక జరిగే ఒప్పందాలను ఉక్రెయిన్ ఎప్పటికీ అంగీకరించబోదని అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: PCC Chief: కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. పదేళ్ళు ప్రాథమిక వైద్యాన్ని మంటగలిపారు

2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా దెబ్బతింది. వందలాది మంది ఉక్రెయిన్ ప్రజలు చనిపోయారు. భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అయితే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సహకరించారు. దీంతో రష్యాపై కూడా ప్రతీకార దాడులు చేశారు. అయితే ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చున్నాక పరిస్థితులు మారాయి. యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ సూచించారు. అలాగే పుతిన్‌ను కూడా ట్రంప్ ఒప్పించారు. ఇన్నాళ్లకు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: SKN: తెలుగు హీరోయిన్ల గురించి సరదాగా అన్నా.. వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్

Exit mobile version