Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
- పాక్ ఆర్మీ చీఫ్‌కు అపరిమిత అధికారాలు..
- న్యాయవ్యవస్థపై రాజ్యాంగ సవరణ ఎఫెక్ట్..
- తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన యూఎన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
Read Also: Siliguri corridor: సిలిగురి కారిడార్‌లో కొత్త సైనిక స్థావరాలు.. బంగ్లా, పాక్, చైనాలకు గట్టి మెసేజ్..
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ శుక్రవారం మాట్లాడుతూ.. పాక్ రాజ్యాంగ సవరణలు చట్టపరమైన సమాజం, పాకిస్తాన్ ప్రజలతో చర్చించకుండా ఆమోదించారని అన్నారు. పాకిస్తాన్ తొందరపడి ఆమోదించిన రాజ్యాంగ సవరణలు న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తాయని, సైనిక జవాబుదారీతనం, చట్ట పాలనపై గౌరవం తగ్గుతాయని అన్నారు. న్యాయవ్యవస్థలో జోక్యం, కార్యనిర్వాహక నియంత్రణకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలు పాకిస్తాన్ ప్రజస్వామ్యానికి, చట్ట పాలన సూత్రాలకు తీవ్ర పరిణామాలు కలిగిస్తాయని అన్నారు.
పాకిస్తాన్ ఇటీవల, సుప్రీంకోర్టు అధికారాలకు కోత పెడుతూ కొత్తగా ఫెడరల్ కాన్సిట్యూషనల్ కోర్టును తీసుకువచ్చింది. రాజ్యాంగ కేసుల్ని ఈ కొత్త కోర్టు విచారిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కేవలం సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే పరిష్కరిస్తుంది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ప్రజాస్వామ్యం కన్నా శక్తివంతంగా మారింది. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసింది. ఇంతకుముందు ఈ అధికారం ప్రెసిడెంట్, క్యాబినెట్ పరిధిలో ఉండేది. ఇప్పుడు అసిమ్ మునీర్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చీఫ్‌గా మారాడు. ఇదే కాకుండా, ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ లకు జీవితాంతం క్రిమినల్ చర్యలు, అరెస్టుల నుండి రోగనిరోధక శక్తిని కల్పిస్తుంది. దీనిపై పాకిస్తాన్ మానవహక్కుల మండలి సభ్యురాలు ఫర్వా అస్కర్, పాకిస్తానీ జర్నలిస్ట్ అలీఫియా సోహైల్‌లు నిరసన తెలపడంతో వీరిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!