NTV Telugu Site icon

United Nations: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి..

Un

Un

United Nations: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింసాకాండలో మైనారిటీలుగా ఉన్న హిందవులపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఈ సందర్భంగా యూఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హింసను అరికట్టాలని కోరుకుంటున్నాం.. హిందూ సమాజానికి చెందిన దేవాలయాలు, వ్యాపారాలు, గృహాలను తగులబెట్టిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 27 జిల్లాల్లోని హిందువులకు చెందిన వ్యాపార సంస్థల్లోని వస్తువులను దోచుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. కొన్ని అల్లరి మూకలు చేసిన దాడుల్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపినట్లు కూడా వార్తలు వచ్చాయని గుటెర్రెస్ పేర్కొన్నారు.

Read Also: Nagarjuna : నా కొడుకు సంతోషంగా ఉండు.. అదే మాకు ఆనందం : నాగార్జున

అయితే, బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో శాంతి, సమ్మిళిత ప్రక్రియ కోసం ప్రయత్నం చేస్తామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. ఇంకా యూనస్‌తో మాట్లాడలేదని.. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాత్కాలిక అధినేత యూనస్ పిలుపుకు మద్దతు ఇవ్వడానికి యూఎన్ కట్టుబడి ఉందని బంగ్లాదేశ్‌లోని ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో- ఆర్డినేటర్ గ్విన్ లూయిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Read Also: Hero Surya : షాకింగ్ న్యూస్… షూటింగులో హీరో సూర్య తలకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

కాగా, బంగ్లాదేశ్ లో నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాన పదవికీ రాజీనామా చేయడంతో పాటు దేశం నుంచి పారిపోయిన తరువాత కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో దాదాపు 232 మంది ప్రాణాలు కోల్పోగా.. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మరణాల సంఖ్య 550కి చేరుకుంది. ఇక, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Show comments