Bangladesh: భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దాడులు, వేధింపుల నుండి తమను రక్షించాలని అలాగే హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి హిందూ సమాజానికి చెందిన సుమారు 300 మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందూ సమాజంపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల…