ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. రష్యా సేనలు ఇప్పటికే ఉక్రెయిన్‌లోని రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించాయి. అయితే, రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులోనూ క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలంటే ఓ బ్రిడ్జి మీద నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలి. ఈ బ్రిడ్జిని కూల్చివేస్తే రష్యా సేనలకు అడ్డుకట్ట వేయవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఆ బ్రిడ్జిని కూల్చివేసేందుకు బాంబులు అమర్చింది.
Read: Crazy News: విజయ్ ‘బీస్ట్’లో విజయ్ సేతుపతి కుమారుడు
అయితే, బ్రిడ్జిని కూల్చివేసే క్రమంలో బాంబులకు ఫ్యూజ్‌లను బిగించింది. అదే సమయంలో రష్యన్ దళాలు ఆ దిశగా వేగంగా దూసుకురావడాన్ని గమనించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్ తనను తాను పేల్చుకొని రష్యా సేనలకు కొంతసేపు నిలువరించేలా చేశాడు. దీంతో ఉక్రెయిన్‌లో విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్ పేరు మారుమ్రోగిపోయింది. రియల్ హీరోగా విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్ ను పేర్కొన్నారు.