Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
- అమెరికా, రష్యా, చైనాల మధ్య త్రైపాక్షిక సమావేశం..
- ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించే అవకాశం..
- తాము లేకుండా చర్చించడంలో ఉపయోగం లేదని ఉక్రెయిన్..
- పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine: చైనాలోని షెంజన్ వేదిక జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్(అపెక్)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంపై ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు సంబంధించిన ఏ అంశంపై చర్చలలోనైనా ఉక్రెయిన్ ఉండటం తప్పనిసరి అని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ లేకుండా తమపై చర్చించడం ఏంటని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలా ట్రంప్, జిన్‌పింగ్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా మాట్లాడుతూ..పుతిన్‌ను బుజ్జగించడానికి బదులుగా యుద్ధాన్ని ఆపేలా ఆయనపై ట్రంప్, జిన్‌పింగ్ ఒత్తిడి తీసుకురావడం మంచిదని అన్నారు. చర్చల నుంచి ఉక్రెయిన్ను మినహాయించడం రష్యా దురాక్రమణను మరింత పెంచేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అపెక్ సమావేశంలో పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్ ఒకే ఫ్రేములో కనిపించారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
Also Read
- Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
- Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
గురువారం రష్యా, యూఎస్, చైనా త్రైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్, యూరప్ దేశాల భాగస్వామ్యం లేకుండానే ఆ మూడు దేశాలు యుద్ధంపై నిర్ణయం తీసుకోవచ్చే ఆందోళనలు ఉన్నాయి. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనాలోని షెన్జెన్కు చేరుకున్నారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
-
Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
-
Gold Purity Test: మీ నగలు అసలైనవేనా? మార్కెట్లో ‘చైనా పౌడర్’ కల్తీ కలకలం.. ఈ టెస్టులతో సింపుల్‌గా పట్టేయండి!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..