లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.
తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్‌ను మంగళవారం రెండు రష్యా క్షిపణులు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించారు, మరో 42 మంది గాయపడ్డారు. మొదటి క్షిపణి రెస్టారెంట్‌ను తాకింది, గణనీయమైన నష్టాన్ని కలిగించింది.
Ukraine War: ఉక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శనివారం క్షిపణులతో దాడి చేసింది. రష్యాతో జరుగుతన్న యుద్ధంతో ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులను అందచేస్తామని బ్రిటన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణల శిథిలాలు తమ భూభాగంలో పడ్డాయని మల్డోవా దేశం ఆరోపించింది. తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డ్నిప్రోలో పై క్షిపణులతో దాడి చేసింది.