Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..

  • రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి..
  • మంటల్లో రాజధాని మాస్కో..
  • ఆయిల్ రిఫైనరీతో పాటు పలు ప్రాంతాలపై దాడి..
Ukrine War

Ukrine War

Ukraine War: ఉక్రెయిన్ రష్యాపై గురువారం భారీ డ్రోన్ దాడి చేసింది. కనీసం రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ దాడిని గుర్తించలేకపోయింది. ఈ దాడిలో రష్యాలోని పలు ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. రాజధాని మాస్కోలో ఈ డ్రోన్ దాడి విధ్వంసాన్ని సృష్టించింది. ఆయిల్ రిఫైనరీల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల్ని నిలిపేశారు. ఒకే వారంలో రెండోసారి ఉక్రెయిన్ రష్యా ఆయిల్ వ్యవస్థల్ని టార్గెట్ చేసింది.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం.. రష్యా వాయు రక్షణ వ్యవస్థలు రాత్రికి రాత్రే వివిధ ప్రాంతాలలో 555 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేశాయి. వాటిలో సుమారు 200 డ్రోన్‌లు రష్యా రాజధానిని సమీపిస్తుండగా అడ్డుకున్నాయి. అయినప్పటికీ, అనేక డ్రోన్‌లు నగరంపై దాడి చేయగలిగాయి. ఈ డ్రోన్ దాడుల వల్ల సదోవోద్ ప్రాంతం, బెలాయా డాచా వంటి షాపింగ్ కాంప్లెక్స్‌లు, కొన్ని నివాస భవనాలు దెబ్బతిన్నాయి. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్, నగర ఆగ్నేయ శివార్లలో మాస్కో చమురు శుద్ధి కర్మాగారంపై అనేక డ్రోన్లు దాడి చేశాయని వెల్లడించారు. మాస్కోలోని నాలుగు ఎయిర్ పోర్టుల్లో విమాన సర్వీసులు నిలిపేశారు. ఈ దాడితో మాస్కోలోని గాజ్‌ప్రోమ్ నెఫ్ట్ చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమైంది. ఇది రాజధాని మాస్కో ప్రాంతానికి అతిపెద్ద ఇంధన సరఫరా సంస్థ.

×
×
Ad

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ జీ 7 సమావేశం కోసం ఫ్రాన్స్‌లో ఉన్న సమయంలోనే ఈ భారీ దాడి జరిగింది. జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో చర్చలు జరిపారు. ప్రపంచ నాయకుల నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందుతుందనే హామీ లభించిందని జెలెన్స్కీ అన్నారు.