Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
- రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి..
- మంటల్లో రాజధాని మాస్కో..
- ఆయిల్ రిఫైనరీతో పాటు పలు ప్రాంతాలపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్ రష్యాపై గురువారం భారీ డ్రోన్ దాడి చేసింది. కనీసం రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ దాడిని గుర్తించలేకపోయింది. ఈ దాడిలో రష్యాలోని పలు ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. రాజధాని మాస్కోలో ఈ డ్రోన్ దాడి విధ్వంసాన్ని సృష్టించింది. ఆయిల్ రిఫైనరీల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల్ని నిలిపేశారు. ఒకే వారంలో రెండోసారి ఉక్రెయిన్ రష్యా ఆయిల్ వ్యవస్థల్ని టార్గెట్ చేసింది.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం.. రష్యా వాయు రక్షణ వ్యవస్థలు రాత్రికి రాత్రే వివిధ ప్రాంతాలలో 555 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేశాయి. వాటిలో సుమారు 200 డ్రోన్లు రష్యా రాజధానిని సమీపిస్తుండగా అడ్డుకున్నాయి. అయినప్పటికీ, అనేక డ్రోన్లు నగరంపై దాడి చేయగలిగాయి. ఈ డ్రోన్ దాడుల వల్ల సదోవోద్ ప్రాంతం, బెలాయా డాచా వంటి షాపింగ్ కాంప్లెక్స్‌లు, కొన్ని నివాస భవనాలు దెబ్బతిన్నాయి. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్, నగర ఆగ్నేయ శివార్లలో మాస్కో చమురు శుద్ధి కర్మాగారంపై అనేక డ్రోన్లు దాడి చేశాయని వెల్లడించారు. మాస్కోలోని నాలుగు ఎయిర్ పోర్టుల్లో విమాన సర్వీసులు నిలిపేశారు. ఈ దాడితో మాస్కోలోని గాజ్ప్రోమ్ నెఫ్ట్ చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమైంది. ఇది రాజధాని మాస్కో ప్రాంతానికి అతిపెద్ద ఇంధన సరఫరా సంస్థ.
Also Read
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
- Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
- US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
- China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్‌కు కొత్త తలనొప్పి..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ జీ 7 సమావేశం కోసం ఫ్రాన్స్‌లో ఉన్న సమయంలోనే ఈ భారీ దాడి జరిగింది. జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో చర్చలు జరిపారు. ప్రపంచ నాయకుల నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందుతుందనే హామీ లభించిందని జెలెన్స్కీ అన్నారు.
BREAKING:
Huge explosions at the Moscow Oil Refinery after it’s struck by several Ukrainian long-range drones.
Looks like Moscow has a day or two of “black rain” ahead of it. pic.twitter.com/1dJGDO9lYI
— Visegrád 24 (@visegrad24) June 18, 2026
తాజావార్తలు
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
-
Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
-
Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
-
Jamun-El Niño: విరగకాసిన ‘‘నేరేడు పండ్లు’’, ఈ ఏడాది వర్షాలు అనుమానమే.. అసలేంటీ ఈ సంబంధం..
-
Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్‌తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!