పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలోనే హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. ఇరు పక్షాలు బందీలు విడుదల చేయడం.. ఖైదీలను అప్పగించుకోవడం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాదు.. శనివారంలోగా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే.. హమాస్ నరకం చూస్తుందని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Stock Market Trading Scam: స్టాక్ మార్కెట్ పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయలు లాగేశారు.. కానిస్టేబుళ్ల కీలక పాత్ర..!
ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్.. జోర్డాన్, ఈజిప్ట్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. గాజా నుంచి వచ్చే పాలస్తీనియన్లను చేర్చుకోవాలన్నారు. లేదంటే సాయం నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. గాజాను తిరిగి అభివృద్ధి చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్కడ ప్రజలను మిత్రదేశాలైన జోర్డాన్, ఈజిప్ట్‌లు చేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజుపై ట్రంప్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గాజా నుంచి వచ్చే పాలస్తీనియన్లను శాశ్వతంగా తీసుకోవాలని జోర్డాన్, ఈజిప్టులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే మాత్రం.. సహాయాన్ని నిలిపివేయనున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Nani: నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ..!
ప్రస్తుతం అమెరికా నుంచి జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సైనిక మరియు ఆర్థిక సహాయాన్ని పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గాజాను స్వాధీనం చేసుకుంటే.. ఈ పాలస్తీనియన్లను మిత్ర దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలకు తరలించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆ రెండు దేశాలు అంగీకరించకపోతే మాత్రం సాయం నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ట్రంప్ ప్రతిపాదనకు ఆ రెండు దేశాలు సిద్ధంగా లేవన్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ప్రతిపాదనను జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు తిరస్కరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ ఆలోచన విధానాన్ని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. మరోసారి ఉద్రిక్తతలు సృష్టించేవిగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: మరో ఘోరం.. బస్సు-ట్రక్కు ఢీ.. ఏడుగురు భక్తులు మృతి