Site icon NTV Telugu

Iran-US: ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది.. లేదంటే ముప్పు తప్పదన్న ట్రంప్

Usisrael

Usisrael

ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఈ శనివారం టెహ్రాన్‌తో ఉన్నతస్థాయి చర్చలు ఉంటాయని చెప్పారు. ఒకవేళ చర్చలు గనుక విఫలమైతే పెద్ద ప్రమాదంలో పడినట్లేనని.. పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇటీవల కూడా ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు. అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడులు ఉంటాయని హెచ్చరించారు. తాజాగా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందిస్తూ.. అమెరికాతో చర్చలు ఉంటాయని.. అయితే ఆ చర్చలు పరోక్షంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో జరగనున్నట్లు ఇరాన్ తెలిపింది.

ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ తిరస్కరించారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు. ఇక ట్రంప్ హెచ్చరికలను ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ప్రతిదాడులకు తాము కూడా వెనకాడబోమని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan to Singapore: కుమారుడికి ప్రమాదం.. హుటాహుటిన సింగపూర్‌కు పవన్‌ కల్యాణ్‌..!

Exit mobile version