Site icon NTV Telugu

Trump-Modi: రష్యా చమురు కొనడం ఆపేయాలి.. లేదంటే భారీ సుంకాలుంటాయి.. భారత్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక

Trump

Trump

భారత్‌ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గిస్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటిదేమీలేదని స్పష్టం చేసింది. తాజాగా ట్రంప్ మాత్రం ఆ వాదనను తీవ్రం చేశారు. ఎయిర్‌ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. భారత్ నిబంధనలకు కట్టుబడి రష్యా దగ్గర చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోతే మాత్రం భారతీయ వస్తువులపై భారీ సుంకాలు ఉంటాయని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!

2022 నుంచి ఉక్రెయిన్-రష్యా దగ్గర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో చర్చలు జరిపారు. అయినా సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్‌కు దీపావళి జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు

అయితే రష్యా దగ్గర పాశ్చాత్య దేశాలు, భారత్, చైనా, పలు దేశాలు చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా ఆర్థికంగా బలపడి యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ వాదించారు. కొనుగోళ్లు ఆపకపోతే భారీ సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు కొనుగోళ్లు నిలిపివేయగా.. భారత్, చైనా మాత్రం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. చమురు కొనుగోలు ఆపకపోతే మరింత సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version