Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’
- ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తాజా హెచ్చరిక
- ఎన్నికల ముందు దాడులు జరగొచ్చని వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఇరాన్‌కు మేం ఏం చేస్తామో వేచి చూడండి.. త్వరలోనే మా చర్యలు చూస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. అలాస్కాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని గతంలో ప్రకటించిన ట్రంప్.. అదే సమయంలో ఇరాన్‌తో దౌత్య చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ట్రంప్ అలాస్కాలోని వాసిల్లా పట్టణంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై మాట్లాడుతూ.. ‘‘ఇరాన్‌కు మేం ఏం చేస్తామో వేచి చూడండి. దానికి గట్టి సమాధానం ఇస్తాం. ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకోవడం అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. అది ఎప్పటికీ జరగదు. ఆ అణు కార్యక్రమం వేల టన్నుల రాళ్ల కింద కూరుకుపోయింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చమురు ధరలు పెరిగినా భరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
దాడులకు సన్నాహాలా?
ఇరాన్‌పై అమెరికా మళ్లీ భారీ స్థాయిలో సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్.. ఇరాన్‌పై పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాల్సి వస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందుకున్నట్లు ‘యాక్సియోస్’ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ప్రచురించిన ఈ కథనం ప్రకారం.. సంభావ్య సైనిక చర్యలకు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేయాలని అమెరికా సెంట్రల్ కమాండ్‌కు సూచించినట్లు సమాచారం. అయితే దాడులు ఎప్పుడు చేపట్టాలన్న దానిపై నిర్దిష్ట తేదీని ఆదేశాల్లో పేర్కొనలేదని నివేదిక తెలిపింది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై సైనిక చర్యలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు భావిస్తున్నట్లు కూడా యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు కూడా ఈ పరిణామం చోటుచేసుకోవచ్చన్న అంచనాలను ప్రస్తావించింది.
నెతన్యాహుతో ట్రంప్ చర్చలు?
ఇరాన్‌పై మరో భారీ సైనిక చర్య చేపట్టే అవకాశంపై ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చర్చించినట్లు గతంలో యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సంయుక్తంగా దాడులు చేసే అవకాశాన్ని ఇరువురు నేతలు పరిశీలించినట్లు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ తెలిపింది. అయితే దాడులు త్వరలోనే జరగనున్నాయన్న వార్తలను ట్రంప్ గతంలో తోసిపుచ్చారు. ఇరాన్‌తో అమెరికా సానుకూల చర్చలు జరుపుతోందని పేర్కొంటూ.. నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేపట్టబోమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!