Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
- ఉక్రెయిన్‌కే పేట్రియట్ క్షిపణుల తయారీ లైసెన్స్
- టర్కీ నాటో సమావేశంలో ట్రంప్ కీలక ప్రకటన
- జెలెన్స్కీకి హామీ ఇచ్చిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. తాజాగా మరోసారి దాడులు తీవ్రమయ్యాయి. ఇలాంటి తరుణంలో టర్కీ వేదికగా జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం సందర్భంగా కీలక హామీ ఇచ్చారు.
ఉక్రెయిన్‌కు అమెరికా కీలక రక్షణ సహకారం అందించేందుకు సిద్ధమైంది. అమెరికా తయారు చేసే అత్యాధునిక పేట్రియట్ (Patriot) ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను ఇకపై ఉక్రెయిన్‌లోనే తయారు చేసుకునేలా లైసెన్స్ ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు.
Also Read
జెలెన్స్కీతో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మేము మీకు పేట్రియట్ క్షిపణులను తయారు చేసుకునే లైసెన్స్ ఇవ్వబోతున్నాం. ఇది చాలా మంచి విషయం. ఇకపై మీకు తగినంత పేట్రియట్ వ్యవస్థలు ఇవ్వడం లేదని మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉండదు.’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని సంబంధిత తయారీ సంస్థకు ఇంకా అధికారికంగా తెలియజేయలేదని, అయినప్పటికీ ఈ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని ట్రంప్ తెలిపారు.
రష్యా దాడులతో ఇబ్బందులు
ఇటీవల రష్యా వరుసగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు అవసరమైన అమెరికా తయారీ పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ఉక్రెయిన్‌లో వేగంగా తగ్గిపోతున్నాయి. దీంతో రష్యా క్షిపణి దాడులను సమర్థంగా ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన ప్రకటన ఉక్రెయిన్‌కు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ఇదే సందర్భంగా రష్యా భూభాగంలోని లక్ష్యాలపై ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడులపై కూడా ట్రంప్ స్పందించారు. ‘‘ఇది ఉద్రిక్తతలను పెంచే చర్యే అయినప్పటికీ.. చివరికి యుద్ధానికి ముగింపు పలికే దిశగా కూడా దోహదపడవచ్చు.’’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారని తాను విశ్వసిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘‘జెలెన్స్కీ ఈ యుద్ధానికి ముగింపు కోరుకుంటున్నారు. అలాగే అధ్యక్షుడు పుతిన్ కూడా ఒప్పందం కావాలనుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఈ ఇద్దరి ఆలోచనలు కలిస్తే యుద్ధం ముగిసే అవకాశాలు మెరుగుపడతాయి.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
- Tags
- NATO Summit
- trump
- Ukraine
- Zelensky
తాజావార్తలు
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
-
Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
-
Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
-
El Nino: భారత్‌కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
-
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..