Site icon NTV Telugu

Trump: భారత్‌లో పెట్టుబడులు ఆపండి.. వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన

Appleceo2

Appleceo2

భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. భారత్‌లో పెట్టుబడులు ఆపి.. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆపిల్ సీఈవోతో ట్రంప్ సంభాషించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య

గురువారం వైట్‌హౌస్‌లో టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఒక పొడవాటి టేబుల్‌పై ట్రంప్ దంపతులు, సీఈవోలంతా కూర్చున్నారు. ఈ సందర్భంగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సీఈవోలతో ట్రంప్ సంభాషిస్తూ ఇతర దేశాల్లో పెట్టుబడులు ఆపి యూఎస్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. గత మే నెలలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ఆపిల్ ఉత్పత్తులను భారత్‌లో నిలిపివేయాలని చెప్పారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని మళ్లీ లేవనెత్తారు.

కుక్‌తో ఇలా..
అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నారు? అని కుక్‌ను అడిగారు. చాలా మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు తనకు తెలుసు అన్నారు. ఇప్పటి వరకు వేరే చోట ఉన్నారని.. ఇప్పుడు సొంతింటికి వచ్చేస్తున్నారని.. ఎంత పెట్టుబడి పెడుతున్నారని టిమ్ కుక్‌ను ట్రంప్ అడిగారు. దీనికి కుక్ సమాధానం ఇస్తూ.. 600 బిలియన్లు అని బదులిచ్చారు. దీంతో ట్రంప్ ప్రశంసించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం తనకు ఇష్టం లేదని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో బాగా చూసుకుంటామని.. ఇకపై భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు.

ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్‌పై డిప్యూటీ సీఎం చిందులు

ఇక విందులో కుడివైపున కూర్చున్న మెటా సీఈవో జుకర్‌‌బర్గ్‌ను కూడా ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలో మీరెంత పెట్టుబడి పెడుతున్నారని అడిగారు. తాను కూడా 600 బిలియన్లు అని సమాధానం ఇచ్చారు. తదుపరి ప్రశ్న గూగుల్‌ సీఈవోను అడిగారు. దీనికి ప్రస్తుతతం 100 బిలియన్లకు దగ్గరగా ఉన్నామని.. రాబోయే రెండేళ్లలో 250 బిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ప్రస్తుతం 75 నుంచి 80 బిలియన్లకు దగ్గరలో ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా బాగుంది.. మిమ్మల్ని చూస్తుంటే గర్వగా ఉందని.. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ట్రంప్ ముగించారు.

 

 

Exit mobile version