యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్‌ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు.…
USA: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై దాడి చేస్తూ నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజా ట్రంప్ మరోసారి వార్తలకెక్కారు. అది కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి జోరుగా సాగుతున్న పుకార్లతో. కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఇక లేరంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. ఇంతకీ ఈ ప్రచారంపై వైట్ హౌస్ ఏమంది, యూఎస్ ఉపాధ్యక్షుడు ఏమని స్పందించారు.. అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Pawan Kalyan:…
శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ…
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాలోని యాంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరంలో జరిగిన సమావేశంపై దృష్టి సారించాయి. ఈ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పనిచేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించారు. అయితే, కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అనేక…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇంట్లోని వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వ్యక్తిగత కరస్పాండెన్స్‌తో కలిపి రహస్య పత్రాలను దాచిపెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్‌లో తెలిపింది.