Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?
- ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఏంటి?
- ట్రంప్ వ్యూహాన్ని ఇరాన్ ఎలా ఢీకొట్టబోతుంది?
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం మారుతుందా? తాజాగా ఆయన ప్రణాళికలు మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన వ్యూహం ఖర్గ్ ద్వీపం వైపు మళ్లినట్లుగా అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి.
ట్రంప్ అసలు దృష్టంతా ఖర్గ్ ద్వీపంపైనే ఉందని.. దాన్ని స్వాధీనం చేసుకోవడమే ప్రస్తుత లక్ష్యంగా అని వైట్ హౌస్ అధికారి చెప్పినట్లుగా ఆక్సియోస్ వెబ్‌సైట్‌కు పేర్కొంది. ఇప్పటికే ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా స్వాధీనం తీసుకునేందుకు పెద్ద ఎత్తున అమెరికా బలగాలను పంపబోతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
యూఎస్ సెంట్రల్ కమాండ్ మాజీ కమాండర్, రాయబారి అయిన జాన్ అబిజైడ్ 2007లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రసంగంలో మాట్లాడుతూ.. ‘‘నిస్సందేహంగా ఇది చమురు గురించే. మనం దానిని నిజంగా కాదనలేము.’’ అని ఇరాక్ యుద్ధ సమయంలో వ్యాఖ్యానించారు. ఇరాక్ యుద్ధానికి చమురుతో సంబంధం ఉందని అబిజైద్ అంగీకరించారు. దీనిని బట్టి చూస్తుంటే ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం కూడా ఖర్గ్ ద్వీపం కోసమే జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. తాజా అమెరికా వ్యూహం ప్రకారం.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు.. అలాగే ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించడానికి ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి.
ఖర్గ్ ద్వీపం..
ఖర్గ్ ద్వీపం.. ఇది ఇరాన్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది ద్వీపం కాదు.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిది. ఈ ఖర్గ్ ద్వీపాన్ని గనుక అమెరికా ముట్టుకుంటే ప్రపంచ దేశాలకు చమురు సంక్షోభం తీవ్రస్థాయిలో తలెత్తి అల్లాడిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ప్రతి రోజు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేస్తోంది. విదేశాలకు విక్రయించే 10 బ్యారెళ్ల చమురులో తొమ్మిది బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే వెళ్తాయి. ఈ ద్వీపానికి దక్షిణ భాగంలో డజన్ల కొద్దీ నిల్వ ట్యాంకులు ఉన్నాయి.
ఖర్గ్ ద్వీపం కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. 1960 నుంచి ఇరాన్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. దీన్ని అమెరికాకు చెందిన అమెకో కంపెనీనే నిర్మించిందని నివేదికలు ఉన్నాయి. చమురు రవాణా ఎక్కువ భాగం ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తుంటాయి. ప్రస్తుతం ఖర్గ్ ద్వీపంలోని చమురు కేంద్రం చాలా చురుగ్గా పని చేస్తోందని నివేదికలు పేర్కొన్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. ఒకవేళ అటువంటి ఆపరేషన్‌కు ఆమోదం లభిస్తే.. భారీ స్థాయిలో సైనికులు అవసరం అవుతారు. ఇక ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత అమెరికా సైనికులపై ఇరాన్ ప్రత్యక్ష దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భారీ దాడులతో ఇరాన్‌ను బలహీన పరిచి.. చర్చలకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని.. దీనికి దాదాపు ఒక నెల సమయం పడుతుందని వైట్ హౌస్ ఆక్సియోస్‌కు తెలిపింది.
ప్రస్తుతం ఇరాన్‌కు అదనపు బలగాలను పంపడంపై వైట్ హౌస్, పెంటగాన్ చర్చిస్తున్నాయి. కానీ ఇంకా తుది నిర్ణయాలు తీసుకోలేదు. ఆక్సియోస్‌కు ముందు.. న్యూస్‌మాక్స్, రాయిటర్స్ కూడా అదనపు బలగాలను పంపే ప్రణాళికలపై వార్తలు ప్రచురించాయి. దాదాపు 2,500 మంది మెరైన్‌లు కూడా కొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!