Site icon NTV Telugu

Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Modi

Modi

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 1 ఒక ముఖ్యమైన రోజు అవుతుందని.. ఆ రోజు తన దేశానికి చాలా డబ్బు వస్తుందని వ్యాఖ్యానించారు. సుంకాలపై ట్రంప్ విధించిన గడువు దగ్గర పడుతోంది. ఆగస్టు 1తో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఒప్పందం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ పేర్కొ్న్నారు.

ఇది కూడా చదవండి: Earthquake: అలస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

త్వరలో భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సూచించారు. భారత మార్కెట్లలోకి ప్రవేశం కల్పించే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని పేర్కొ్న్నారు. ఇక ఇండోనేషియాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఇండోనేషియా 19 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: జగన్‌ వర్క్ ఫ్రమ్ బెంగళూరు.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు..!

ఇక భారత్-అమెరికా మధ్య ఐదో రౌండ్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి. రెండు దేశాల మధ్య నిబంధనల ప్రకారం చర్చలు జరుగుతున్నట్లుగా భారత ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అగ్ర రాజ్యం.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మినహాయింపులు కోరుతోంది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమ అనేది భారతీయులకు సెంటిమెంట్. ఒకవేళ అమెరికా ఒత్తిడికి తలొగ్గి మినహాయింపులు ఇస్తే.. వ్యవసాయం, పాడి పరిశ్రమ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తాయి. అందుకే ఈ విషయంలో భారత్ తాత్సారం చేస్తోంది. అయితే ట్రంప్ విధించిన గడువు మాత్రం దగ్గర పడుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version