అగ్ర రాజ్యం అమెరికా ప్రకృతి విపత్తులతో అతలాకుతలం అవుతోంది. నిన్నామొన్నటిదాకా వరదలతో టెక్సాక్, మెక్సికో, న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలు అల్లాడిపోయాయి. పదులకొద్దీ జనాలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆస్తి ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: నర్సును క్షమించొద్దు.. శిక్షించాల్సిందే.. బాధిత సోదరుడు డిమాండ్
భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భద్రతా సూచనలు పాటించాలని ప్రజలను అధికారులు కోరారు. పోపోఫ్ ద్వీపంలోని సాండ్ పాయింట్ సమీపంలో 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. దీంతో అలస్కా తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగా అలాస్కాలో భూకంపం సంభవించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భూకంపం కారణంగా భారీగా నష్టం జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు.
ఇది కూడా చదవండి: UP: పోలీసుల కర్కశత్వం.. ప్యాంట్‌పై సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య
అలాస్కా ద్వీపకల్పం మధ్యలో ఉన్న పోపోఫ్ ద్వీపంలోని సాండ్ పాయింట్ సమీపంలో మధ్యాహ్నం 12:30 గంటలకు (స్థానిక సమయం) భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. మిచిగాన్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం తీవ్రమైన నష్టాన్ని కలిగించే భూకంపంగా పేర్కొంది. తీవ్రత 7.0-7.9 మధ్య ఉంటుందని భావించింది. ప్రతి సంవత్సరం ఈ తీవ్రతతో దాదాపు 10–15 భూకంపాలు నమోదయ్యాయి.
